పేకాట స్థావరాలపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్

పేకాట స్థావరాలపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్

గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం నాగులపాడు, కొప్పరు గ్రామాలలో ఆదివారం సాయంత్రం పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పెదనందిపాడు ఎస్సై మధు పవన్ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 17, 500 నగదును స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచినట్లు ఎస్సై తెలిపారు.