స్వచ్ఛ హరిత రేటింగ్‌కు ఎంపికైన 8 పాఠశాలలు
కరీంనగర్ జిల్లా నుంచి 'స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ' రాష్ట్ర స్ధాయి రేటింగ్‌కు 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ కె.లక్ష్మి కిరణ్, డీఈఓ అశ్విని తానాజీ వాకడే ఎంపికైన ప్రధానోపాధ్యాయులను అభినందించారు. క్యాంపు కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు అందించారు. రాష్ట్ర స్థాయిలోను వంద శాతం మార్కులు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.