VIDEO: 'స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలి'
WGL: రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలోని రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.