శ్రీశైల క్షేత్రంలో పునుగుపిల్లి సంచారం

శ్రీశైల క్షేత్రంలో పునుగుపిల్లి సంచారం

KNL: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలోని ఆలయ ఉచిత క్యూలైన్లో బుధవారం ఉదయం పునుగు పిల్లి భక్తులకు కనిపించింది. వెంటనే భక్తులు ఆ పునుగు పిల్లి దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా వైరల్ చేశారు. గతంలో క్యూలైన్ ఏర్పాటుకు ముందు పునుగు పిల్లుల సందడి అధికంగా ఉండేదని భక్తులు పేర్కొన్నారు. క్యూలైన్ ఏర్పాటుతో వాటి జాడ తగ్గిందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.