దక్షిణకొరియాలో మౌలాలి పిల్లోడు హవా!

మేడ్చల్: దక్షిణ కొరియాలో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ రోబోట్ కాంపిటీషన్‌లో మౌలాలి గాయత్రి నగర్‌కు చెందిన వంటేరు వేదాన్ష్ రెడ్డి గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. 9వ తరగతి చదువుతున్న పిల్లోడు, అండర్–14 విభాగంలో ఈ గౌరవాన్ని సాధించాడు. చిన్నతనం నుంచే రోబోటిక్స్‌లో ఆసక్తి చూపిస్తూ పలు బహుమతులు గెలుచుకున్న వేదాన్ష్ మరో విజయాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు.