'ఉపాధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి'

SRD: గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు మెరుగ్గా ఉండాలని MPDO సత్తయ్య పేర్కొన్నారు. బుధవారం కంగ్టి మండలంలోని ఆయా గ్రామాలను ఆయన సందర్శించి ఉపాధి పనులను పరిశీలించారు. ఈ మేరకు ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున చల్లటి పూట పనులు చేయాలని ఎంపీడీవో సూచించారు.