ఎన్నికల్లో ఏర్పాట్లు పూర్తి: ఎంపీడీవో
RR: షాద్‌నగర్ నియోజకవర్గంలోని 153 గ్రామపంచాయతీలలో జరిగే ఎన్నికల్లో భాగంగా అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన సామాగ్రిని ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు ఇప్పటికే చేరుకుంది. ఫరూఖ్‌నగర్ మండలంలోని 47 గ్రామ పంచాయతీలకు 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 410 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో బన్సీలాల్ తెలిపారు.