రెండు ఎకరాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

రెండు ఎకరాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

RR: కొండాపూర్ సెంట్రల్ పార్క్ కాలనీలో రెండు ఎకరాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. పార్కు స్థలం కబ్జాకు గురైందని హైడ్రా ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో భూమిని పరిశీలించి పార్కు స్థలంగా నిర్ధారించింది. తాత్కాలిక షెడ్లను తొలగించి భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కుస్థలంగా బోర్డులు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టింది.