నిలిచిన నీరు.. స్పందించని జీపీ సిబ్బంది

KMM: నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలోని రామచంద్రపురం రోడ్డులో వర్షపు నీరు ఎటు వెళ్లక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. పంచాయతీ సెక్రటరీ, గ్రామపంచాయతీ సిబ్బందికి ఎన్నిసార్లు తెలియజేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.