కావూరి సాంబశివరావుకు ఎమ్మెల్యే కామినేని నివాళి
ELR: మాజీ మంత్రి, మాజీ MP కావూరి సాంబశివరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయానికి కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాసరావు గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కావూరి మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. మచిలీపట్నం పార్లమెంట్ నుంచి మూడుసార్లు, ఏలూరు పార్లమెంట్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికై ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు.