నేడు ప్రొద్దుటూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
KDP: ఈ రోజు ప్రొద్దుటూరులో విద్యుత్ నిర్వహణ పనుల వల్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు DEE శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. ఈ మేరకు విద్యుత్ ఉప కేంద్రాలు, ట్రాన్స్ పార్మర్లు, విద్యుత్ లైన్ల మరమ్మతులు, నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సరఫరా నిలిపి వేస్తామన్నారు. దీంతో వినియోగదారులు ఈ అసౌకర్యానికి సహకరించాలని కోరారు.