ఉప్పల్ రోడ్లపై తొలగించని గార్బేజి.. కమిషనర్ సార్ చర్యలేవి..?
MDCL: సార్ మాటలను.. ఉప్పల్ అధికారులు పట్టించుకున్నట్లు లేదు. సెవెన్ హిల్స్ కాలనీలో మధ్యాహ్నం 2 దాటినా రోడ్డుపై చెత్త తొలగించలేదు. GHMC, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉ.9:30 వరకు రోడ్లపై గార్బేజి తొలగించాలని కమిషనర్లు కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి చెబుతూనే, ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో!