VIDEO: రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
KMR: గాంధారి మండలం దుర్గంలో రూ. 10 లక్షల వ్యయంతో ఇవాళ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాలతో చేపట్టిన ఈ పనులతో గ్రామంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. వర్షాకాలంలో సమస్యలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.