వణుకూరు గోసాల సెంటర్‌లో తారు రోడ్డు నిర్మాణం

వణుకూరు గోసాల సెంటర్‌లో తారు రోడ్డు నిర్మాణం

కృష్ణా: పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలోని గోసాల సెంటర్ కార్నర్‌లో చిన్నపాటి వర్షానికే నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆదేశాల మేరకు అక్కడి ఎత్తును పెంచి తారు రోడ్డును నిర్మించారు. ఈ అభివృద్ధి పనులను సర్పంచ్ పందిపాటి ఇంద్ర, డీఈ శ్రీనివాస్, ఏఈ రాజేష్, వార్డు మెంబర్ షకార్ పరిశీలించారు.