నేడు కాకినాడలో జాబ్ మేళా

నేడు కాకినాడలో జాబ్ మేళా

కాకినాడలో ఏపీ నైపుణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు శనివారం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 30కి పైగా కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధి అవకాశాల మెరుగుదలే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు