అమరావతిలో లోకేష్ నూతన గృహ పరిశీలన
GNTR: రాజధాని అమరావతిలో మంత్రి నారా లోకేష్ తన నూతన గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. శరవేగంగా జరుగుతున్న ఈ ఇంటి నిర్మాణాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. పనుల పురోగతిని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. రాజధాని నుంచే పాలన సాగించాలన్న సంకల్పంతో, ప్రజలకు అందుబాటులో ఉండేలా లోకేష్ ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.