విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: ఎస్పీ

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: ఎస్పీ

SRPT: మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లాలో విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచాపై నిషేధం విధిస్తున్నట్లు ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు. ఈనెల 16 వరకు కోడ్ అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయవద్దని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.