బ్రిటిష్ కరెన్సీకి కొత్త లుక్..!
బ్రిటన్ కరెన్సీ నోట్లపై ఇక నుంచి చారిత్రక వ్యక్తులకు బదులుగా వన్యప్రాణులు, ప్రకృతి చిత్రాలు కనిపించనున్నాయి. మెజారిటీ ప్రజలు ప్రకృతి డిజైన్లకే మొగ్గు చూపడంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది. నోట్ల వెనుక భాగంలో ముద్రించే జంతువుల జాబితాను నిపుణులు సిద్ధం చేస్తున్నారు. అయితే, నోట్ల ముందు భాగంలో మాత్రం కింగ్ చార్లెస్ III చిత్రమే కొనసాగుతుంది.