ఘనంగా డీకే అరుణ జన్మదిన వేడుకలు

ఘనంగా డీకే అరుణ జన్మదిన వేడుకలు

MBNR: మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ జన్మదిన వేడుకలు ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున భాజపా కార్యాలయానికి చేరుకుని ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.