మంచినీరు కొళాయిలో మురికి నీరు

అనకాపల్లి: అచ్చుతాపురం మండలం దోసురు గ్రామంలో సామాన్య ప్రజలు కనీస అవసరమైన త్రాగునీరు కుళాయి నందు మురికి నీరు వస్తుండడం చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచ్కి సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి కనీస అవసరమైన త్రాగునీరుని పరీక్షకు పంపి మంచినీరు సరఫరా తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తున్నారు.