ఆకట్టుకున్న ఆపరేషన్ సింధూర్ శకటం, కమాండర్స్

SRD: నేడు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రమైన కంగ్టిలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడలిలో విద్యార్థులు దేశభక్తి గేయాలపై ఆకర్షణీయమైన సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు. వివిధ మ్యూజిక్ రికార్డింగ్ సాంగ్స్ పై డ్యాన్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ విమాన శకటం, కమాండర్స్ వ్యోమీకా సింగ్, సోఫియా ఖురేషి వేషధారణలో పూజ, మౌనిక బాలికలు అలరించారు.