VIDEO: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని ధర్నా
కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని మంత్రాలయం రాఘవేంద్ర కూడలిలో ఆదోని జిల్లా సాధన సమితి ధర్నా నిర్వహించింది. ప్రభుత్వం ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే సాగునీరు, తాగునీరు, నిధులు పుష్కలంగా వస్తాయని నాయకులు ప్రజలకు వివరించారు. ఆదోని జిల్లాగా ప్రకటించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని పేర్కొన్నారు.