బాలికల వసతి గృహాల్లో శక్తి యాప్‌ ఎస్సై అవగాహన

బాలికల వసతి గృహాల్లో శక్తి యాప్‌ ఎస్సై అవగాహన

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని బాలికల వసతి గృహాలను వెలిగండ్ల ఎస్సై కృష్ణ పావని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినిల భద్రత కోసం అత్యవసర సహాయము కోసం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి యాప్ గురించి బాలికలకు అవగాహన కల్పించారు. బాలికలు మహిళలు ప్రమాద పరిస్థితుల్లో ఉంటే వెంటనే శక్తి యాప్ ద్వారా సహాయం పొందగలరని తెలిపారు. ఈ యాప్‌ను ప్రతి విద్యార్థిని డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.