ఘనంగా బాపట్ల జిల్లా ఆవిర్భావ వేడుకలు

ఘనంగా బాపట్ల జిల్లా ఆవిర్భావ వేడుకలు

బాపట్ల జిల్లా నాల్గవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని విస్తరణ శిక్షణా కేంద్రం సమావేశ మందిరంలో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఈ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో పలువురు జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు.