అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్

KRNL: ఆదోనిలోని పాత ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ కృష్ణ తనిఖీ చేశారు. మెనూ ప్రకారం రూ. 5కే టిఫిన్‌లో పూరి, ఇడ్లీ, సాంబర్, చట్నీ ఉండాలని, మధ్యాహ్నం, సాయంత్రం అన్నం, సాంబార్, పప్పు, పెరుగు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు.