'స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలవాలి'

HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలోని సుస్మిత గార్డెన్‌లో బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులు ఐక్యంగా ఉంటూ అన్ని ఎన్నికల్లోను మనమే గెలుపొందేలా కృషి చేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.