పద్మశాలి సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ధూళిపాళ్ల

పద్మశాలి సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ధూళిపాళ్ల

గుంటూరు: జిల్లా పొన్నూరు పట్టణం 24వ వార్డులోని పద్మశాలి కళ్యాణ మండపంలో సంఘం సభ్యులతో ఆత్మీయ సమావేశాన్ని శుక్రవారం టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర నిర్వహించారు. ఈ సమావేశంలో పద్మశాలీల సమస్యలు, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో పూర్తిగా న్యాయం చేస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.