కన్నుల పండుగగా విగ్రహాల ఊరేగింపు
NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కాగా ఉదయం అమ్మవారి విగ్రహాలను కన్నుల పండుగగా బాజా బజంత్రీలు, శివసత్తుల నృత్యాల నడుమ ఊరేగింపు చేపట్టారు. అనంతరం ఆలయం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు.