డ్రగ్స్ రాకెట్.. డాక్టర్ కూతురు అరెస్ట్

డ్రగ్స్ రాకెట్.. డాక్టర్ కూతురు అరెస్ట్

HYD: ఓ డ్రగ్స్ రాకెట్‌లో కీలక వ్యక్తులను HYD పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి యజమాని అయిన డాక్టర్ కూతురు కూడా ఉంది. ఆమె కూడా డాక్టర్. డ్రగ్స్‌కు బానిస అయిన ఆమె.. ఒక్క ఏడాదిలో ఏకంగా రూ. 70 లక్షల విలువైన డ్రగ్స్‌ను వాడినట్లు అధికారులు తెలిపారు. ఆ యువతితో పాటు మరొక డ్రగ్స్ కొరియర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.