VIDEO: విద్యుత్ షాక్‌తో.. ఓ వ్యక్తి మృతి
BHN: యాదాద్రి జిల్లా మోత్కూర్ ట్రాన్స్ ఫార్మర్ రిపేరింగ్ సెంటర్‌లో విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి చెందాడు. ఆత్మకూరు ఏం మండలం పారుపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డికి ట్రాన్స్ ఫార్మర్ వైరింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలినట్టు తోటి కార్మికులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.