పాఠశాల బంద్ చేయించిన BRS నాయకులు
WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఇవాళ ఓపెన్ ఉండగా BRS నాయకులు స్కూల్‌కి వెళ్లి బంద్ చేపించారు. BRS మండల అధ్యక్షుడు బాల్నే వెంకన్న ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు మండలంలో నిరసన చేపట్టారు. పాఠశాల ఓపెన్ చేశారన్న సమాచారం తెలియడంతో అక్కడికి వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడి, స్కూల్ బంద్ చేయించి విద్యార్థులను ఇంటికి పంపించేశారు.