CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PLD: ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట పెన్నిధి అని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 34 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 44.45 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్నవారు సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.