జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో నర్సింగ్ సీట్లకు కౌన్సిలింగ్
SRD: సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో నర్సింగ్ కోర్సుకు అడ్మిషన్ల కౌన్సిలింగ్ గురువారం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరిగింది. మొత్తం 325 సీట్లకు 123 సీట్లు భర్తీ అయినట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు. విద్యార్థులకు కేటాయించిన కళాశాలలో వెంటనే చేరాలని సూచించారు.