VIDEO: 'మత్స్యకారుల ఇబ్బందులు పరిష్కరించాలి'
VSP: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈస్ట్ కోస్ట్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ సరఫరా నిలిచిపోవడం, భరోసా కార్డులు పనిచేయకపోవడంతో నష్టాలు వస్తున్నాయని చెప్పారు. రోజుకు లక్ష లీటర్ల డీజిల్ అవసరమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.