ఘనంగా పాండురంగ విఠలేశ్వరుడి రథోత్సవం
WNP: జిల్లా కేంద్రంలోని పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ విఠలేశ్వరుడి స్వామివారి రథోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం రాత్రి స్వామి అమ్మవార్లను తేరు మీద ఆశీనులు చేసి మేళతాలాల మధ్య పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. విఠలా విఠలా పాండురంగ విఠలా .. జే జే పాండురంగ విఠలా అంటూ భక్తులు స్వామివారిని కొలిచారు.