TTD పరకామణిలో చోరీపై కాకాణి కీలక వ్యాఖ్యలు
NLR: పరకామణి చోరీ ఘటనపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని YCP నేత కాకాణి ప్రశ్నించారు. ‘TTD పరకామణిలో 2025 జనవరి 11న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య 550గ్రా. బంగారం దొంగతనం చేసి దొరికాడు. ప్రభుత్వం ఎందుకు దర్యాప్తును గుట్టుచప్పుడు కాకుండా చేస్తోంది. నిందితుడికి బెయిల్ ఎలా వచ్చింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి ఘటన జరిగితే జగన్ చర్యలు తీసుకున్నారు' అని పేర్కొన్నారు.