కలవర పెడుతున్న చిరుతల మృత్యువాత

కలవర పెడుతున్న చిరుతల మృత్యువాత

NRPT: జిల్లాలో ఇటీవల చిరుతల మరణాలు పెరగడం జంతు ప్రేమికుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పేరపళ్ల గ్రామ గుట్టల ప్రాంతంలో సోమవారం ఓ చిరుత మృతదేహం లభ్యమైంది. మద్దూరు మండల పరిధిలో కొంతకాలంగా ఏకంగా 4 చిరుతలు మృత్యువాత పడ్డాయి. జాదవ్రావుపల్లె, నందిపాడు, దుప్పటి ఘాట్, మోమినాపూర్ గుట్టల్లో ఇరుక్కుని చిరుతలు మృతి చెందడంపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు.