పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఈనెల 17న ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలను పక్కడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. పది పరీక్షలపై గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు అసౌకర్యం కలకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.