సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఇంఛార్జ్ కలెక్టర్
కృష్ణా: రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో ఇవాళ భూ-పరిపాలన ప్రధాన కమీషనర్ విజయలక్ష్మీ, మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ డెవలప్‌మెంట్ ముఖ్యదర్శి సురేష్ కుమార్‌లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఇంఛార్జ్ కలెక్టర్ నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై సమీక్షించినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయా అంశాలపై దిశా నిర్దేశం చేశారు.