భూత్పూర్ ZPHS పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
MBNR: భూత్పూర్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు భోజనాన్ని నాణ్యతగా వడ్డించాలని అన్నారు. ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ విద్యార్థులతో కలిసి భోజనం చేయకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.