VIDEO: కబేళాకు తరలిస్తున్న గోవులు పట్టివేత
WGL: ఖిల్లా వరంగల్ మండలం మామునూర్‌లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వాహనంలో 15 గోవులను కబేళాకు తరలిస్తున్న ఘటనలో భజరంగ్ దళ్ సభ్యులు వాహనాన్ని పట్టుకుని మంగళవారం పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమతులు, రసీదులు లేకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి గోవులను వర్ధన్నపేట బృందావనం గోశాలకు తరలించారు.