నేరాలపై గ్రామసభలో పోలీసుల అవగాహన
సత్యసాయి: లేపాక్షి మండలం తిలక్‌నగర్, సలామత్ నగర్‌లలో పోలీసులు గ్రామసభ నిర్వహించారు. సీఐ జనార్ధన్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై నరేంద్ర ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించారు. చోరీల నివారణ, రోడ్డు భద్రత, మహిళా రక్షణ, భూ వివాదాల పరిష్కారంపై సూచనలు చేశారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.