VIDEO: రోడ్లు దుర్భరం.. ప్రజలు ఇబ్బందులు
KRNL: ఆదోని నుంచి ఆస్పరి, పత్తికొండ, బెంగళూరుకు వెళ్లే ప్రధాన రహదారి దుర్భరంగా మారింది. రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతల కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఆటోలు సైతం తరచూ గుంతల్లో పడి బోల్తా పడుతున్నాయి. ఈ మార్గంలో ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కనీసం గుంతలు పూడ్చే పనులు కూడా చేయకపోవడంపై వాహనదారులు, స్థానికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.