బొద్దూరులో పారిశుద్ధ్య లోపం

బొద్దూరులో పారిశుద్ధ్య లోపం

VSP: సంతకవిటి మండలం బొద్దూరు గ్రామంలో శివాలయం వీధిలో మురుగు కాలువలు వ్యర్థాలతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. మురుగు పేరుకుపోవడం వల్ల విష జ్వరాలు వస్తాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.