పదో తరగతి పరీక్షలకు 1268 మంది విద్యార్థులు
SKLM: నరసన్నపేట మండలంలో ఈనెల 16వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం అవుతున్నామని ఎంఈఓ పేడాడ దాలినాయుడు తెలిపారు. ఇవాళ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. 10 పరీక్షలకు సంబంధించి 1268 మంది విద్యార్థులు రాస్తుండగా ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసేమన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు కొనసాగుతాయి అన్నారు.