ప్రజలకు ప్రధాని మోదీ ఈస్టర్ శుభాకాంక్షలు
ఈస్టర్ పండగ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ పవిత్రమైన రోజు ఆశను, పునరుద్ధరణను చాటిచెబుతుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో శాంతిని, ఆనందాన్ని, వెలుగును నింపాలని ఆశిస్తున్నా. ఏసుక్రీస్తు బోధనలు అందరినీ దయతో ఉండేలా ప్రేరేపించి, సమాజంలో ఐకమత్య స్ఫూర్తిని బలపరచాలని ఆకాంక్షిస్తున్నా' అని మోదీ పేర్కొన్నారు.