ఘనంగా జరుగుతున్న ఉయ్యూరు సిడి బండి ఉత్సవం
కృష్ణా: ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్లలో భాగంగా 11వ రోజు అత్యంత విశిష్టమైన శిడి బండి ఉత్సవం జరుగుతోంది. ఉయ్యూరు వీధులు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. శిడి బండిపై వెళ్లే వ్యక్తిపై భక్తులు అరటికాయలు విసురుతూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉయ్యూరు వీధులన్నీ భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది సిడి బండిలో విక్రమ్ సింహను కూర్చోబెట్టారు.