సీఐకి రాఖీ కట్టిన మహిళా నాయకులు

MDK: రక్ష బంధన్ కార్యక్రమంలో భాగంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం మెదక్ పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో మెదక్ టౌన్ సీఐ మహేశ్‌కు బీజేపీ జిల్లా మహిళా మోర్చా నాయకులు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా నాయకురాలు పట్లోల మల్లికా, బెండ వీన, ఐతరం సంగీత, కాస ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.