రిటైర్డ్ ఉద్యోగి మృతి.. మంత్రి తుమ్మల నివాళి

KMM: నీటిపారుదల శాఖ విశ్రాంత పర్యవేక్షక ఇంజనీర్ తక్కెళ్ళపాటి సీతారామయ్య గురువారం ఉదయం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, సీతారామయ్య భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఉన్నారు.