VIDEO: గురుకులలో ఒకేరోజు మూడు పరీక్షలు నిర్వహణ
ప్రకాశం: కొండపిలోని గురుకుల పాఠశాలలో ఆదివారం మూడు కీలక ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఆరో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలతో పాటు నీట్ నమూనా పరీక్షలకు 198 మంది విద్యార్థులు హాజరైనట్లు అబ్జర్వర్ సుశాంత్ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేర్వేరు సమయాల్లో ఈ పరీక్షలు జరిగాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షలకు హాజరయ్యారు.